Siddharth Aditi Rao : డేటింగ్ సీజన్ నడుస్తోంది.. కెమెరాకు చిక్కిన అదితి, సిద్ధార్ద్..
Siddharth Aditi Rao : డీసెంట్ బాయ్ సిద్ధార్ద్, తేనె కళ్ల సుందరి అదితి రావు హైదరి డేటింగ్‌లో ఉన్నారనే వార్త వైరల్ అవుతోంది.;
Siddharth Aditi Rao : డీసెంట్ బాయ్ సిద్ధార్ద్, తేనె కళ్ల సుందరి అదితి రావు హైదరి డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో పిక్స్ కూడా అప్లోడ్ చేశారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం సినిమాలో ఇద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమాయణం స్టార్ట్ అయిందని టాక్.
సిద్ధార్ధ్ అదితి డేటింగ్‌లో లేరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గాసిప్స్ కూడా బయటకు వచ్చాయి. నిన్న సిద్ధార్ద్ అదితి ముంబయిలోని ఓ సెలూన్ నుంచి బయటకు రావడంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ పై చర్చ స్టార్ట్ అయింది. అక్కడ ఫోటోలు తీస్తున్న కెమెరామెన్‌ను సిద్ధార్ద్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సిద్ధార్ద పుట్టిన రోజు సందర్భంగా అదితి ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ అయింది.