Siddharth: 'నువ్వు ఎప్పటికీ నా ఛాంపియన్‌వే'.. సైనాతో వివాదానికి చెక్ పెట్టిన సిద్ధార్థ్..
Siddharth:'నువ్వు చేసిన ట్వీట్‌కు నేను రెస్పాన్స్‌గా రాసిన ఓ జోక్ గురించి నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.';
Siddharth: అనిపించింది అనిపించినట్టు చెప్పేసే వారు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో హీరో సిద్ధార్థ్ కూడా ఒకడు. తనకు ఎవరైనా నచ్చకపోతే.. వారికి సిద్దార్థ్ ఇచ్చే సమాధానాలు ఇప్పటికీ చాలా కాంట్రవర్సీలకే దారితీశాయి. అలాగే ఇటీవల సైనా నెహ్వాల్ ట్వీట్‌ను కోట్ చేస్తూ సిద్ధార్థ్ చేసిన రీ ట్వీట్ పెద్ద దుమారానికే దారితీసింది. దానికి సిద్ధార్థ్ ఇటీవల క్షమాపణలు చెప్పుకున్నాడు.
కొన్నిసార్లు జోక్‌గా అన్న మాటలు కూడా సోషల్ మీడియాలో ఎంత కాంట్రవర్సీకి దారితీస్తాయో చెప్పలేం. అలాగే తాను జోక్‌గా భావించి సైనా నెహ్వా్ల్‌కు రీ ట్వీట్ చేసింది కూడా సరికాదంటూ చాలామంది దీనిని ఖండించారు. మహిళా కమిషన్ అయితే ఏకంగా సిద్ధార్థ్ ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని రిక్వెస్ట్ పెట్టింది. దీనికి సిద్దార్థ్ ఇప్పుడు స్పందించాడు.
'కొన్నిరోజుల క్రితం నువ్వు చేసిన ట్వీట్‌కు నేను రెస్పాన్స్‌గా రాసిన ఓ జోక్ గురించి నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను నీతో చాలా విషయాల్లో ఏకీభవించకపోవచ్చు. అయినా నేను నీ ట్వీట్‌ను చదివినప్పుడు నాకు వచ్చిన అసహనం, కోపం కూడా నేను అన్న మాటలను న్యాయం చేయలేవు. నాలో దానికంటే మంచి గుణమే ఉంది. ఇక నేను వేసిన జోక్ విషయానికొస్తే.. అది అంత మంచి జోక్ కాదు. నువ్వు నా లెటర్‌ను అంగీకరిస్తావనుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ నా ఛాంపియన్‌వే. ' అంటూ ఓ లెటర్‌ను ట్వీట్ చేశాడు సిద్ధార్థ్.
సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌లో పురుషాహంకారం కనిపిస్తుందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన ఉద్దేశం అది కాదని, తాను కూడా ఫెమినిస్ట్ అని లేఖలో స్పష్టం చేశాడు సిద్దార్థ్. అయితే తన ట్వీట్ ఉద్దేశం అది కాదని, బహిరంగంగా క్షమాపణ తెలిపిన సిద్దార్థ్ ప్రవర్తనను నెటిజన్లు ప్రశంసిస్తు్న్నారు. ఈ ట్వీట్‌పై సైనా ఇంకా స్పందించలేదు.
Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY
— Siddharth (@Actor_Siddharth) January 11, 2022