Siddu Jonnalagadda: తాను అమ్మాయిల వెంటపడే ప్లే బాయ్ కాదంటున్న సిద్ధు జొన్నలగడ్డ..

Siddu Jonnalagadda: సినిమాలో టిల్లులాగా తాను కూడా ఒక ప్లే బాయా? అని యాంకర్ అడగగా సిద్ధు ఆ ప్రశ్నకు కొంచెం తడబడ్డాడు.;

Update: 2022-02-19 06:27 GMT

Siddu Jonnalagadda (tv5news.in)

Siddu Jonnalagadda: టాలీవుడ్‌లోకి రోజుకు ఎంతోమంది కొత్త హీరోలు పరిచయమవుతుంటారు. కానీ వారందనరికీ కెరీర్‌లో బ్రేక్ రావడానికి, ప్రేక్షకుల దగ్గర నుండి గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అలాగే 'డిజే టిల్లు'తో అందరి చూపు తనవైపు తిప్పుకున్న సిద్ధుకు కూడా ఈ స్థాయి వరకు రావడానికి 12 ఏళ్లు పట్టింది. అయితే డీజే టిల్లులో టిల్లుగా అందరినీ ఇంప్రెస్ చేసిన సిద్ధు.. ఆ క్యారెక్టర్‌కు, తనకు ఎలాంటి పోలికలు ఉన్నాయో బయటపెట్టాడు.

చాలామంది యంగ్ హీరోలు కమర్షియల్ సినిమాలవైపు వెళ్తుంటే.. అందులో కొందరు మాత్రమే యూత్‌ఫుల్ కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఒక కథే 'డీజే టిల్లు'. సినిమా మొదలయిన దగ్గర నుండి పూర్తయ్యే వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల సినిమా కాబట్టే దీనికి అంతటా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

డీజే టిల్లు సినిమాలో హీరో క్యారెక్టర్ ఒక మామూలు మిడిల్ క్లాస్ అబ్బాయిలాంటిదే. చిన్న చిన్న ఫంక్షన్స్‌లో డీజేగా పనిచేసే టిల్లుకు అమ్మాయిల వెంటపడే అలవాటు ఉంటుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధుకు దీనికి సంబంధించిన ప్రశ్నే ఎదురయ్యింది. సినిమాలో టిల్లులాగా తాను కూడా ఒక ప్లే బాయా? అని యాంకర్ అడగగా సిద్ధు ఆ ప్రశ్నకు కొంచెం తడబడ్డాడు.

ప్లే బాయ్ అంటే అమ్మాయిల వెంటపడుతూ జోకులు చెప్తూ నవ్వించేవాడు అని యాంకర్ చెప్పగా.. దానికి సిద్ధు.. ఒకవేళ తనకు ఎవరైనా అమ్మాయి నచ్చితే నేరుగా వెళ్లి మర్యాదగా మాట్లాడతాను అని సమాధానం ఇచ్చాడు.

Tags:    

Similar News