ఎనర్జిటిక్ సింగర్ గా పేరు తెచ్చుకున్న కల్పన నిన్న (మంగళవారం) తన ఇంట్లో ఆత్మహత్యా ప్రయత్నం చేయడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఎప్పుడూ హుషారుగా కనిపిస్తూ తన చుట్టూ ఉన్న పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతూ కనిపించే కల్పనలో ఇంతటి విషాదం ఎలా వచ్చింది.. ఎవరి వల్ల వచ్చింది అనే కోణంలో చాలా చర్చలే వినిపించాయి. అవన్నీ ఎలా ఉన్నా.. ముందు కల్పన ప్రమాదం నుంచి బయట పడింది. ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదు అని డాక్టర్లు చెప్పారు. దీంతో అభిమానులు, సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసలు కల్పన ఎందుకు ఈ ప్రయత్నం చేసింది అంటే ఎవరికి వాళ్లు ఏదేదో చెప్పుకుంటున్నారు.
కల్పన చాలా యేళ్ల క్రితం కేరళ అతన్ని పెళ్లి చేసుకుంది. కూతురు పుట్టిన తర్వాత విడిపోయింది. 2018లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. భర్త, కూతురు(మొదటి భర్తకు పుట్టింది)తో హైదరాబాద్ లోనే కాపురం పెట్టింది. ఈ నేపథ్యంలో తన కూతురు కొన్ని రోజులుగా కేరళలోనే ఉంటానని.. అక్కడే చదువుకుంటానని చెబుతోందట. కాదూ హైదరాబాద్ లోనే ఉంటూ, ఇక్కడే చదువుకోవాలని కల్పన సూచిస్తూ వస్తోంది. ఈ విషయమై ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయట. కల్పన ఆత్మహత్యా ప్రయత్నం చేసినప్పుడు కూడా కూతురు కేరళలోనే ఉంది. ఈ విషయం తెలిసే హుటాహుటిన తను వచ్చింది. వచ్చీ రాగానే ప్రెస్ మీట్ పెట్టి మా మధ్య ఏం లేదు అని చెబుతోంది. అంతే కాదు.. ‘మమ్మీతో డాడీతో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు’ కేవలం చిన్న డిప్రెషన్ కారణంగా కాస్త ఎక్కువ స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం వల్లే ఇలా అయింది తప్ప ఇందులో ఎవరి తప్పూ లేదని చెప్పింది. ఏదేమైనా కల్పన పూర్తిగా కోలుకుని అసలు విషయం చెప్పే వరకూ క్లారిటీ రాదు. బట్.. కూతురు కాబట్టి ఈ విషయాన్ని చెప్పే అవకాశాలే లేవు. ఏదేమైనా కల్పన త్వరగా కోలుకుని మళ్లీ మునుపటిలా ఉత్సాహంగా ఉండాలని కోరుకుందాం.