Sitara Dance: సూపర్‌స్టార్ కూతురు సూపర్ డ్యాన్స్.. ఫ్యాన్స్ ఫిదా
Sitara Dance: నాన్న కుట్టి అప్పుడే అంత పెద్దది అయిందా.. నాన్నకు మించి డ్యాన్స్ చేస్తోంది.;
Sitara Dance: వావ్.. ఎంత బాగా డ్యాన్స్ చేస్తోంది సితార.. నాన్న కుట్టి అప్పుడే అంత పెద్దది అయిందా.. నాన్నకు మించి డ్యాన్స్ చేస్తోంది. అనీ మాస్టర్ పర్యవేక్షణలో డ్యాన్స్ నేర్చుకుంటున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సితార డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డీజే స్నేక్ చార్ట్ బస్టర్ టకీ టకీ అనే పాటకు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అనీ మ్యామ్ స్టెప్పులతో రీచ్ అవడానికి ప్రయత్నించాను. ఇంకా బాగా రావాలి. అంటూ సితార ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.