ఐకన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా అతని లుక్ చాలా హాట్ టాపిప్ గా అయింది. ఓ పెద్ద స్టార్ అయిన అల్లు అర్జున్ ఇలాంటి గెటప్ లో కనిపించడం మాత్రం గ్రేట్ థింగ్ అని చెబుతున్నారు. కాస్త గుండుతో కనిపించే లుక్.. దీంతో పాటు చేతులు మొత్తం పెద్దగా ఉన్న గోర్లు, నిండా గుబురు గడ్డం, ఓ రాక్షసుడి మాదిరిగా కనిపిస్తున్నాడు. అందుకే ఈ లుక్ విడుదలైన క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అల్లు అర్జున్ తో పాటు దీపికా పదుకోణ్ నటిస్తోన్న ఈ మూవీకి అట్లీ దర్శకుడు. ఇక అతని బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ అప్డేట్ కూడా వచ్చింది.
ఈ రాక మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పటి కాస్ట్ లీ క్యారెక్టర్ అయిన రమ్యకృష్ణ కూడా కనిపించబోతోందట. ఆమె పాత్ర కూడా చాలా బలంగా ఉంటుందని టాక్. ఓ రకంగా బాహుబలిలో శివగామి తర్వాత మళ్లీ ఆ రేంజ్ క్యారెక్టర్ తను చేస్తోంది అంటున్నారు. అందుకే ఈమె అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మామూలుగా ఇలాంటి నటులు షేర్ చేయడం అత్యంత అరుదు. అరుదైనా ఆమె కూడా సినిమాలో ఉంటేనే వర్కవుట్ అవుతుంది. అందుకే రమ్యకృష్ణ రాక మూవీలో ఓ కీలకమైన పాత్రలో నటించబోతోంది అనేది అర్థం అవుతోంది. మరి తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి.