Sivasankar Master: శివశంకర్ మాస్టర్ కన్నుమూత..
Sivasankar Master: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.;
Sivasankar Master (tv5news.in)
Sivasankar Master: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా పోరాడుతూ వెంటిలేటర్‌పై ఉన్న శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. కరోనా తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల మాస్టర్‌ను వెంటిలేటర్‌పై పెట్టి వైద్యులు చికిత్సను అందించారు. ఆయనకు కొందరు సినీ ప్రముఖులు ఆర్థికంగా సాయం కూడా చేశారు. అయినా మాస్టర్ కరోనాతో పోరాడలేక వెనుదిరిగారు.
ఆసుపత్రిలో చేర్చే సమయానికే శివశంకర్ మాస్టర్‌కు 75శాతం ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆయన ఇన్ని రోజులు ఎమర్జెన్సీ వార్డులోనే ఉన్నారు. ఆయనతో పాటు భార్య, పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకింది. మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.