నలుగురులో మాట్లాడుతున్నప్పుడు నాలుక అదుపులో పెట్టుకోవాలి. వేదికలపై యధాలాపంగా అన్నా.. అది ఇంటెన్షనల్ గానే వెళుతుంది. అందుకే కొన్నిసార్లు జోక్ గా చెప్పిన మాటలు సీరియస్ గా వెళతాయి. బట్ రీసెంట్ గా డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘మేమంతా వేరే భాష హీరోయిన్లనే ప్రేమిస్తాం. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో అర్థమైంది. అందుకే ఇక నుంచి తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం’ అని నిర్మాత ఎస్కేఎన్ చెప్పిన మాటలు టాలీవుడ్ లోనే మంటలు రేకెత్తిస్తున్నాయి. అతనిపై వ్యక్తిగతంగా విమర్శలు వస్తున్నాయి. ఓ రకంగా అతని ఇమేజ్ ను డామేజ్ చేశాయి ఈ మాటలు.
ఎస్కేఎన్ చెప్పిన మాటలను అందరూ అతని రీసెంట్ బ్లాక్ బస్టర్ బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎంకరేజ్ చేస్తే చెప్పినట్టు పడుండాలా అంటూ రివర్స్ లో కౌంటర్స్ వేస్తున్నారు. దీనిపై ఎస్కేఎన్ మీడియాలో ఉన్న తన ఫ్రెండ్స్ ను కూడా వాడుకుని మరీ సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్ట్ లు పెట్టించాడు. అయినా అతనిపై విమర్శలు ఆగలేదు. దీంతో తనే ఓ వీడియో బైట్ ను విడుదల చేశాడు. తను ఇప్పటి వరకూ 8మంది హీరోయిన్లను పరిచయం చేశానని.. ఇక ముందు కూడా పరిచయం చేస్తానని చెప్పాడు. హీరోయిన్ గానే కాక ఇతర క్రాఫ్ట్స్ లో కూడా 25 మంది వరకూ పరిచయం చేయాలని ముందే అనుకున్నానని చెబుతూ.. తను జోక్ గా చెప్పిన మాటలు వేర్వేరు అర్థాలతో హెడ్ లైన్స్ మారడం నచ్చలేదు అని చెప్పాడు.
అంటే ఆ స్టేజ్ పై చెప్పిందంతా జోకే అంటాడు. సో.. మీరు సీరియస్ గా తీసుకోవద్దు అనేది అతని వెర్షన్. బట్ అతను స్టేజ్ పై చెప్పిన విధానం చూస్తే ఎక్కడా జోక్ గా చెప్పినట్టు లేదు. ఇంటెన్షనల్ గానే అన్నట్టు కనిపించింది. మామూలుగానే ఎస్కేఎన్ మైక్ దొరికితే ఓ రేంజ్ లో ఊదరగొడతాడు అనే పేరుంది. సో.. ఇప్పుడతను ఎన్ని కవర్ చేసుకున్నా కామెంట్స్ ఆగుతాయి అనుకోలేం. అయినా ఫలానా వారిని ఎంకరేజ్ చేయమని అతన్నెవరైనా అడిగారా.. పాత్రలకు సెట్ అయితేనే కదా తీసుకునేది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందుకే అంటారు.. అడుసు తొక్కనేలా కాళ్లు కడగనేలా అని.