Sonam Kapoor : సోనమ్ కపూర్ మామగారి సంస్థలో సైబర్ మోసం.. పక్కాగా చేధించిన పోలీసులు..!
Sonam Kapoor : బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మామ హరీష్ అహుజా యొక్క ఎక్స్‌పోర్ట్ సంస్థ నుండి ఇటీవల రూ. 27 కోట్లకు పైగా మోసగించిన సైబర్ నేరగాళ్ల బృందాన్ని ఫరీదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.;
Sonam Kapoor : నటి సోనమ్ కపూర్ మామగారు హరీష్ అహుజా యొక్క ఎక్స్‌పోర్ట్ సంస్థ నుండి రూ. 27 కోట్లకు పైగా మోసగించిన సైబర్ నేరగాళ్ల ముఠాను ఫరీదాబాద్ పోలీసులు ఛేదించారు. షాహీ ఎక్స్‌పోర్ట్ ఫ్యాక్టరీకి చెందిన రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ లెవీస్ (ROSCTL) లైసెన్స్‌లను అతని నకిలీ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఆధారంగా దుర్వినియోగం చేసి, మోసగాళ్లు మోసం చేశారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
దీనిపైన ఫరీదాబాద్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ నితీష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ROSCTL లైసెన్సుల రూపంలో ఎగుమతి సంస్థలకు కొన్ని ప్రోత్సాహకాలను ఇస్తుందని, వారికి ఎక్సైజ్ మరియు కస్టమ్స్ సుంకాలలో కొంత రాయితీని కల్పిస్తుందని అన్నారు. మోసగాళ్లు అహుజా సంస్థకు చెందిన రూ. 27.61 కోట్ల విలువైన మొత్తం 154 ROSCTLలను స్వాధీనం చేసుకున్నారని.. వాటిని వారు తెరిచిన నకిలీ మరియు కల్పిత సంస్థలకు బదిలీ చేశారని DCP తెలిపారు.
వారు ఈ కూపన్‌లను ఇతర సంస్థలకు బదిలీ చేయడం ద్వారా ఎన్‌క్యాష్‌గా పొందేవారని డీసీపీ అగర్వాల్ తెలిపారు.. గత ఏడాది జూలైలో సునీల్ అహుజా సంస్థ దీనిపైన ఫిర్యాదు చేయగా ఫరీదాబాద్ పోలీసులు ఢిల్లీ, ముంబై, చెన్నై, కర్ణాటకతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.. నిందితుల్లో కొంత మంది మాజీ క్లర్క్‌లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉద్యోగులు DGFT పనిలో బాగా ప్రావీణ్యం ఉన్నవారు ఉన్నారని అధికారి తెలిపారు.
కాగా సోనమ్ కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత 2018 లో హరీష్ కుమారుడు ఆనంద్ అహుజాని వివాహం చేసుకుంది... ఆనంద్ ఫ్యాషన్ బ్రాండ్‌ని నడుపుతూ తన తండ్రి కంపెనీలో డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు