Sonu Sood : హ్యాట్సాఫ్ సోనూసూద్... అభినందించకుండా ఉండలేం..!
Sonu Sood : కరోనా లాంటి విపత్కరమైన సమయంలో అందరికి అండగా నిలిచి రియల్ హీరో అని అనిపించుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్;
Sonu Sood : కరోనా లాంటి విపత్కరమైన సమయంలో అందరికి అండగా నిలిచి రియల్ హీరో అని అనిపించుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్.. ముఖ్యంగా వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని వారి సొంతగ్రామాలకి చేర్చడంలో ఆయనని ఎంత మెచ్చుకున్న తక్కువే.. ఇప్పటికి తన సేవ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు సోనూసూద్.
తాజాగా పంజాబ్ లోని తన సొంత గ్రామమైన మోగాలో 'మోగాకి భేటి' పేరుతో అతిపెద్ద సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సోనూ సూద్.. ఇందులో ఆయన చెల్లెలు మాళవిక కూడా భాగం అయ్యారు.. అక్కడ 8వ తరగతి నుంచి ఇంటర్ చదివే ఆడపిల్లలకు సైకిళ్లను అందించారు. దాదాపుగా 40 గ్రామాల్లోని ఆడపిల్లలకు ఈ సైకిళ్లను అందించారు.
తాను ఇంకా ఏ రాజకీయ పార్టీలో చేరనందున, దివంగత తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో, 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' కింద ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాళవిక తెలిపారు.
#SonuSood is back for the nation, he distributes 1000 bicycles to school students and social workers in hometown Moga
— Sreenivas Gandla (@SreenivasPRO) January 5, 2022
.@SonuSood pic.twitter.com/SgwKzoLvg1