Sonu Sood: సోనూ సూద్ ఫస్ట్ లవ్ లెటర్ ఆమెకే..
Sonu Sood: సోనూ సూద్.. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ పేరుకు పరిచయం అవసరం లేదు.;
Sonu Sood: సోనూ సూద్.. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఈయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వలస కార్మికుల కుటుంబాలకు ఆయన చాలా దగ్గర మనిషి. ఇలాంటి రియల్ హీరో.. తన సౌకర్యాలను దాటి ప్రజలకు సేవ చేయాలంటే తనకంటూ ఒక సపోర్ట్ కావాలి.. తాను ఏం చేసినా తన అడుగులో అడుగు వేసే మనిషి కావాలి. ఆమే సోనాలీ సూద్. ఈరోజు తన భార్య సోనాలీ సూద్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు.
సోనూ సూద్ నార్త్.. సోనాలీ సూద్ సౌత్.. అందులోను తనొక తెలుగమ్మాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. తాను కూడా ఎప్పుడు పెద్దగా లైమ్ లైట్‌లోకి రావడానికి ఇష్టపడదు. సోనూ సూద్ కూడా సినిమా, ఇల్లు తప్ప పెద్దగా ఈవెంట్స్‌కు రావడం కూడా తక్కువే. అలా ఈ జంట పాపులారిటీకి కాస్త దూరంగా ఉంటారు. కానీ కోవిడ్ సమయంలో వీరు చేసిన పనుల వల్ల ఒక్కసారిగా వీరిని దైవ రూపాలుగా భావించడం మొదలుపెట్టారు ప్రజలు.
సోనాలీ, సోనూ సూద్‌ల ప్రేమ ఇప్పటిది కాదు.. వీరిద్దరు నాగ్‌పూర్‌లో కలిసి చదువుకున్నారు. సోనాలీనే సోనూకు ఫస్ట్ లవ్. ఈ విషయాన్ని సోనూ సూద్ ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. మెల్లగా వీరిద్దరి పరిచయం ప్రేమలేఖల వరకు వెళ్లింది. సోనూ.. సోనాలీ కోసం రాసిన ఓ ప్రేమలేఖను ఇప్పటికీ పదిలంగానే దాచుకున్నారు. మొదట్లో సోనూ యాక్టింగ్ చేస్తానంటే సోనాలీ ఒప్పుకోలేదట. కానీ ఇప్పుడు సోనాలీ మాత్రమే తనకున్న ఒకేఒక్క సపోర్ట్ అంటారు సోనూ సూద్. తాను నటుడు అయినప్పుడు కంటే సోషల్ వర్కర్‌గా మారినప్పుడే సోనాలీ ఎక్కువగా సంతోషపడిందన్నారు సోనూ.
సోనూ సూద్ యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత ముంబాయ్‌లో వీరిద్దరు చిన్న ఫ్లాట్‌లో ఉండేవారు. అక్కడి నుండి ఎంతో కష్టపడి ఈ స్థాయిలో నిలబడ్డారు సోనూ సూద్. తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్ట్ పెట్టారు. 'నా జీవితాన్ని పూర్తి చేసినందుకు థాంక్యూ. నా ధైర్యం, నా స్ఫూర్తి, నా బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నందుకు థాంక్యూ. హ్యాపీ బర్త్‌డే. లవ్ యూ' అని ఓ క్యూట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.