Ram Charan : పెద్దితో వైరల్ వయ్యారి సయ్యాట

Update: 2025-08-05 08:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న పెద్ది కోసం ఓ మాంచి కిక్ ఇచ్చే జానపద గీతం ప్లాన్ చేసుకున్నారట. మామూలుగా కథా పరంగా ఉత్తరాంధ్ర నేపథ్యం ఉండబోతోంది. మరి ఉత్తరాంధ్ర అంటే జానపదాలకు కొదవా. అందుకే అక్కడి నుంచే ఇలాంటి ఓ సాంగ్ ప్లాన్ చేశాడు బుచ్చిబాబు.

సినిమాలో స్పెషల్ సాంగ్ గా ఉండే ఈ పాటలో నర్తించేందుకు చాలామంది బ్యూటీస్ ను అనుకున్నారట. ఫైనల్ గా వైరల్ వయ్యారి శ్రీలీల అయితేనే సెట్ అవుతుందని భావించారని టాక్. గతంలోనే పెద్ది మూవీలో శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోంది అనే వార్తలు వచ్చాయి. తాజాగా అవి నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సో.. రహమాన్ కు తెలుగు ఫోక్స్ గురించి అంత బాగా తెలిసి ఉండదు. అయినా కంపోజింగ్ తో అదరగొడితే.. ఈ పాటకు డ్యాన్స్ హైలెట్ అవుతాయి అని వేరే చెప్పక్కర్లేదు. రామ్ చరణ్, శ్రీ లీల డ్యాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లిపోతాయేమో. కాకపోతే ఈ న్యూస్ ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ అవలేదు.

Tags:    

Similar News