Sri Vishnu : శ్రీ విష్ణు సింగిల్ మూవీ సెన్సార్ పూర్తి

Update: 2025-05-03 10:59 GMT

వైవిధ్యమైన సినిమాలతో ఆడియన్స్ కు మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే టార్గెట్ గా దూసుకుపోతున్నాడు హీరో శ్రీ విష్ణు. రేంజ్ మార్చుకోవడం కోసం ప్రయోగాలు అవీ చేయకుండా తన దారిలో తను స్మూత్ గా వెళ్లిపోతున్నాడు. అతను హీరోగా నటించిన మూవీ ‘సింగిల్’. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, కల్యా ఫిల్మ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కాబోతున్నాయి. ఆ మధ్య తమిళ్ లో లవ్ టుడే అనే మూవీతో ఫేమ్ అయిన బ్యూటీ ఇవాన, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించిన ఈమూవీలో వెన్నెల కిశోర్ మరో ‘ఫుల్ లెంగ్త్’ రోల్ లో కనిపించబోతున్నాడు.

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కొత్తగా లేకపోయినా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ఉంది. రెగ్యులర్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ లో మరో కథగా కనిపిస్తోంది. అయితే ఈ మూవీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను బట్టి సింగిల్ విజయం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. శ్రీ విష్ణు ఎప్పట్లానే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తాజాగానే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన సింగిల్ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి ‘యూ/ఏ’సర్టిఫికెట్ వచ్చింది. మరి ఇద్దరు హీరోయిన్లతో చేయించిన గ్లామర్ వల్లనా లేక ట్రైలర్ లోనే విచ్చలవిడిగా కనిపించిన బూతుల వల్ల ఈ సర్టిఫికెట్ వచ్చిందా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.

 

Tags:    

Similar News