Sri Vishnu : దరిద్రానికి దత్త పుత్రుడు.. నా చిన్ననాటి మిత్రుడు

Update: 2025-02-10 11:08 GMT

వైవిధ్యమైన కథలతో ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తోన్న హీరో శ్రీ విష్ణు. తన రేంజ్ కు తగ్గ కథలు సెలెక్ట్ చేసుకుంటూ ఇమేజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. చివరగా వచ్చిన శ్వాగ్ ఆకట్టుకోలేదు.లేటెస్ట్ గా అతను 'సింగిల్'గా రాబోతున్నాడు.సింగిల్ అతని కొత్త సినిమా టైటిల్ అన్నమాట. తాజాగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇది చూస్తే శ్రీ విష్ణు మరోసారి గట్టిగా నవ్వించబోతున్నాడు అని మాత్రం అర్థం అవుతుంది. ఈ వీడియో వెన్నెల కిశోర్ చెబుతున్నట్టుగా ఉంది.

'నువ్వింకా సింగిలేనా' అని ఎవరో లేడీ వెన్నెల కిశోర్ ను అడుగుతుంది. 'ముడ్డికింద ముప్ఫైఐదేళ్లొచ్చినా కూడా నాకింకా పెళ్లి కాలేదంటే దానిక్కారణం ఆ నాకొడుకే' అంటాడు. ఎవడాడు అంటే.. 'దరిద్రానికి దత్త పుత్రుడు నా చిన్ననాటి మిత్రుడు'అని సమాధానం చెబుతాడు. కట్ చేస్తే లుంగీ కట్టుకుని గాగుల్స్ పెట్టుకుని సిగరెట్ కాలుస్తూ.. అందరివాడిని నేను ఎవ్వరి వాడిని కాదు అంటూ అనే పాట రేడియోలో పెట్టుకుని ఎక్కడ జంటలు కనిపిస్తే అక్కడ దీపావళి పటాస్ లు విసురుతూ వస్తుంటాడు శ్రీ విష్ణు. ఆడేంటీ అంత సైకోలా ఉన్నాడు.. కొంపతీసి లవ్ ఫెయిల్యూరా అంటే.. కరెంట్ లీ ఇద్దరమ్మాయిలు ప్రేమిస్తున్నారు వాణ్నిఅంటాడు వెన్నెల కిశోర్. ఆ ఇద్దరూ కేతిక శర్మ, ఇవానా అంటూ వీడియోలో పరిచయం చేశారు.ఇలా మంచి వినోదాత్మకంగా ఈ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారన్నమాట.

ఇక ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తుండగా.. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తోంది. సో.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉందన్నమాట. 

Full View

Tags:    

Similar News