Srivalli Song: వావ్.. 'పుష్ప' పాటకు ఇంగ్లీష్ వర్షన్ అదిరిపోయిందిగా..!
Srivalli Song: శ్రీవల్లి పాటకు ఇంప్రెస్ అయిన ఎమ్మా.. దీనికి ఇంగ్లీష్ వర్షన్‌ను తయారు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.;
Srivalli Song: 'పుష్ప' సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. క్రికెటర్స్‌తో సహా అందరూ పుష్పలోని ఏదో సీన్‌ను, పాటను, డైలాగును రీల్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో కూడా పుష్ప క్రేజ్ తగ్గేదే లే అన్నట్టుగానే ఉంది. తాజాగా పుష్పలోని శ్రీవల్లి పాటకు ఇంగ్లీష్ వర్షన్‌ను పాడింది ఓ డచ్ సింగర్. ప్రస్తుతం ఈ ఇంగ్లీష్ వర్షన్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
పుష్పలోని తగ్గేదే లే డైలాగుకు ఎంత క్రేజ్ ఉందో.. అందులోని శ్రీవల్లి పాటకు కూడా అంతే క్రేజ్ ఉంది. మామూలుగానే సిడ్ శ్రీరామ్ వాయిస్‌లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ శ్రీవల్లి పాటకు బాగా పనిచేసింది. అందుకే సినిమా విడుదలయ్యి నెల దాటిపోయినా.. ఇంకా ఈ పాటను పదే పదే వింటున్న వారు చాలామందే ఉన్నారు. హిందీలో ఈ పాటను జావేద్ అలీ ఆలపించాడు.
శ్రీవల్లి పాటకు ఇంప్రెస్ అయిన డచ్ సింగర్ ఎమ్మా హీస్టర్స్.. దీనికి ఇంగ్లీష్ వర్షన్‌ను తయారు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. తెలుగు వర్షన్‌ను ఎంతగానో ఇష్టపడిన ప్రేక్షకులు.. ఈ ఇంగ్లీష్ వర్షన్‌ను కూడా అంతే ఆదరణ చూపిస్తున్నారు. ఎమ్మా ఎక్కువగా కవర్ సాంగ్స్ పాడడం, ఇంగ్లీష్ సాంగ్స్‌ను ఆలపించడం చేస్తుంది. కానీ తొలిసారి తానొక తెలుగు పాటను పాడడం విశేషం అనుకుంటున్నారు తన సబ్ స్క్రైబర్స్.