టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఎన్ని రికార్డులు కనుమరుగు కాబోతున్నాయా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నవాళ్లు కూడా రికార్డుల లెక్కల కోసమే సిద్దంగా ఉన్నారు. అయితే వీళ్లు కేవలం ఇండియాలో కాక ప్రపంచంలోనే ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. ఇలాంటి రికార్డ్ ఇప్పటి వరకూ వాల్డ్ వైడ్ గా ఏ సినిమా పరిశ్రమలోనూ లేదు. ఉన్నా వీళ్ల లాగా ఒకేసారి కనిపించేది కాదు ఆ రికార్డ్.
ఈ చిత్రాన్ని అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించబోతున్నాడు రాజమౌళి. కొంత మైథలాజికల్ టచ్ ఉంటుందనే టాక్ కూడా ఉంది. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వేరే పాత్రల్లో ఇంకెవరు నటిస్తున్నారు అనేది సీక్రెట్ గానే ఉంచాడు రాజమౌళి. తన గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీకి సంబంధించి చాలా అంటే చాలా ఎక్కువ రహస్యం మెయిన్టేన్ చేస్తున్నాడు.
ఇక ఈ మూవీకి సంబంధించిన రికార్డ్ ఏంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారట. ఈ మేరకు ఆయా దేశాల నుంచి మూవీ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్స్ లతో బేరసారాలు మాట్లాడేశాడట రాజమౌళి. సో.. ఇలా ఒకేసారి 120 దేశాల్లో ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమా రిలీజ్ కాలేదు. ఆ అరుదైన రికార్డ్ ను మహేష్ బాబు, రాజమౌళి సినిమా నెలకొల్పబోతోంది. ఇందులో సగం దేశాల్లో సినిమా కనెక్ట్ అయినా ఇండియాలో ఇప్పటి వరకూ ఎవరూ సాధించని కలెక్షన్స్ ను ఈ చిత్రం సాధిస్తుంది.