మహేశ్-రాజమౌళి #SSMB29 సినిమాకు ప్రియాంకా చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారన్న టాక్ నడుస్తోంది. నిజమైతే భారత హీరోయిన్లలో ఇది రికార్డ్ రెమ్యునరేషన్ అయ్యే అవకాశం ఉంది.
ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్‌లో ఇదే ఆమె చివరి సినిమా.