కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి కారు గిప్ట్ ఇచ్చిన స్టార్ హీరో
జానీ మాస్టర్ తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో పని చేశారు.;
ఇండస్ట్రీలో హిట్ ఇచ్చిన వారికి గిప్ట్ లు ఇవ్వడం సర్వ సాధారణం. కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. స్టార్ హీరోలకు డాన్స్ కంపోజ్ చేస్తుంటారు జానీ మాస్టర్.. బుల్లితెర మీద కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న జానీ మాస్టర్ తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో పని చేశారు. ఈ సందర్భంగా సుదీప్ మాస్టర్ కి మంచి కాస్ట్ లీ గిప్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.
ఖరీదైన థార్ కారును ఆయనకు బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను మాస్టర్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. సుదీప్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. కారు ధర సుమారు రూ.12-14 లక్షలు ఉండొచ్చని తెలుస్తుంది. కాగా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోణ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సుదీప్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీకరించిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
Thank You for the Gift @KicchaSudeep sir & family ❤
— Jani Master (@AlwaysJani) March 25, 2022
The way you Treat me & Take care of me make me feel blessed 😇
Will always love you Sir, Happy to have you in my life 🙏🏼 pic.twitter.com/0U2Ldpv32A