Aditi Rao Hydari : ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండు : అదితి రావు హైదరీ

Update: 2025-05-07 11:15 GMT

సౌత్ టు నార్త్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన హీరోయిన్లలో అదితి రావు హైదరీ ఒకరు. రొటిన్ స్టోరీస్ కాకుండా విభిన్నమైన స్టోరీలను ఎంచుకుంటూ కథా నాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవలే హీరో సిద్ధార్థ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టింది. మ్యారేజ్ తర్వాత కూడా సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది అదితి. అలాగే ఈముద్దుగుమ్మ తన భర్త సిద్ధార్థ్ తో కలిసి ఒక వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'ఎలాగైతే నీటి ప్రవాహం ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని కూడా సరైన గమ్యస్థానానికి చే రుకుంటుందో.. అలాగే మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ ఆలోచనలు, మనసును కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. సరైన మార్గంలో పయనించండి. ప్రపంచం మీతో చెలగా టమాడుతున్నప్పుడు స్వచ్ఛంగా ఉండండి. దారిలో ఎప్పుడూ మెరుస్తూ ఉండు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News