మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న క్రేజీ మూవీ వారణాసి. ఈ మూవీపై ముందు నుంచీ భారీ అంచనాలున్నాయి. వాల్డ్ వైడ్ ఆడియన్స్ మొత్తానికి నచ్చే కంటెంట్ తో రూపొందుతోంది అని ముందు నుంచీ చెబుతున్నారు. ఈ మూవీకి ముందు మహేష్ బాబు కేవలం తెలుగు స్టార్ మాత్రమే. ప్యాన్ ఇండియా హీరో కూడా కాదు. బట్ ఈ మూవీతో ఒకేసారి ప్యాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు. ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ గా నటించబోతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూవీలో మరో స్టార్ కు కూడా ఛాన్స్ ఉంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ స్టార్ ఇంకెవరో కాదు.. సుదీప్.
యస్.. సుదీప్ కన్నడలో పెద్ద స్టార్. అతను కూడా ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూనే ఈ మధ్య మూవీస్ చేస్తున్నాడు. కానీ అవేవీ వర్కవుట్ కావడం లేదు. బట్ అంతకు ముందే రాజమౌళి ఈగ మూవీలో విలన్ గా నటించి అందరినీ మెప్పించాడు. మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఆ కారణంతోనే బాహుబలిలో ఓ కేమియో రోల్ లో కనిపించాడు సుదీప్. అలాంటి నటుడిని వారణాసిలో తీసుకున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తుంది. అతని నటనకు రాజమౌళికి కూడా బాగా ఇష్టం. ఆ ఇష్టం కారణంతోనే సుదీప్ ను తీసుకున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మూవీలో సుదీప్ పాత్ర చాలా బలంగా ఉండబోతోందంటున్నారు. మొత్తంగా కాస్త ఆలస్యం అయినా ఈగ విలన్ ఈ సారి ప్యాన్ వరల్డ్ ఆడియన్స్ కు బాగా తెలిసిపోబోతున్నాడు.