Sudha Chandran: మోదీజీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలును తొలగించమంటున్నారు
Sudha Chandran: కృత్రిమ కాలుతో నాట్యం చేసి దేశ కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసింది నాట్య మయూరి సుధా చంద్రన్.;
Sudha Chandran: నాట్య మయూరి సుధా చంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు చెకింగ్‌లో ప్రతిసారి ఆర్టిఫిషియల్ కాలును తీసేయమని అధికారులు ఆదేశిస్తుండడంపై అభ్యంతరం చెబుతున్నారు.
వ్యక్తిగత పనులు, షూటింగుల కోసం ప్రయాణిస్తున్న ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతోందని చెప్పారు. కృత్రిమ కాలుతోనే నాట్యం చేస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచిన తనపై ఇలా వ్యవహరించడం సరైనదేనా అంటూ ప్రశ్నించారు.
దేశంలోని మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ఇన్‌స్టాలో ఓ వీడియో విడుదల చేశారు. తనలాంటి వారందరికీ సీనియర్ సిటిజన్ కింద ఓ కార్డును ఇప్పించి.. ఈ తరహా చెకింగ్స్ నుంచి దూరంగా పెట్టాలంటూ మోదీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు