Suhana Khan: సీక్రెట్ ఫ్రెండ్‌తో స్టార్ హీరో కూతురు.. కారులో మొహం దాచుకుంటూ..

Suhana Khan: సుహానా ఖాన్.. హీరోయిన్‌గా నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్‌తో పరిచయం కానుంది.

Update: 2022-03-24 13:45 GMT

Suhana Khan: బాలీవుడ్‌లో ఎవరి మీద అయినా రూమర్స్ క్రియేట్ అవ్వాలంటే వారు నటీనటులే అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలు, సీనియర్ హీరోయిన్ల వారసులు అయినా.. వారిపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా కారులో ఓ సీక్రెట్ ఫ్రెండ్‌తో దొరికిపోయింది ఓ స్టార్ హీరో కూతురు. అప్పటినుండి తనపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షారుక్ ఖాన్.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్‌కే కింగ్ ఖాన్‌గా ఎదిగాడు. ఎప్పుడూ ఇండస్ట్రీలో తనపై ఎప్పుడూ బ్లాక్ మార్క్ పడలేదు. కానీ తన కుమారుడు ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం షారుక్ కెరీర్‌కు పెద్ద డ్రా బ్యాక్‌లాగా మారింది. షారుక్‌కు ఎంత మార్కెట్ ఉన్నా.. తన సినిమాలకు ఎంత రేంజ్‌లో కలెక్షన్లు వచ్చినా.. వాటికి హిట్ టాక్ రాకపోవడానికి కారణం షారుక్ పర్సనల్ లైఫ్ అని అనుకుంటున్నారు అభిమానులు.


షారుక్ ఖాన్ పర్సనల్ ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతోంది. తన వారసులు ఇద్దరూ త్వరలోనే బాలీవుడ్‌లో సెటిల్ అవ్వనున్నారు. తన కుమారుడు ఆర్యన్ ఖాన్.. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌కు రైటర్‌గా డెబ్యూ చేయనుండగా.. కూతురు సుహానా ఖాన్.. హీరోయిన్‌గా నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్‌తో పరిచయం కానుంది. తాజాగా సుహానా ఖాన్ పేరు బాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తోంది.

తాజాగా మూంబాయిలోని షారుక్ ఖాన్ ఇల్లు మన్నత్ ముందు కారులో సుహానా ఖాన్ కెమెరా కంటికి చిక్కింది. అయితే ఆ కారులో తనతో పాటు ఓ అబ్బాయి కూడా ఉండడం బాలీవుడ్ సర్కి్ల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కెమెరాలను చూసిన వీరిద్దరు వెంటనే మొహం దాచుకున్నారు. కానీ అందులో ఉన్నది సుహానా ఖాన్ అని తెలిసిపోయింది. అయితే తనతో పాటు ఉన్న అబ్బాయి ఎవరో అని ఆరాతీస్తోంది బాలీవుడ్ మీడియా.



Tags:    

Similar News