నటుడు సుహాస్ 'మండాడి' మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగింది. చెన్నై సముద్ర తీరంలో 'మండాడి' సినిమా షూటింగ్ కోసం సాంకేతిక నిపుణులతో ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులతో పాటు కెమెరాలు నీటిలో మునిగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన తోటి వారు సముద్రంలో పడిన ఇద్దరు వ్యక్తులను కాపాడగా కెమెరాలు, ఇతర సామగ్రి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో పడవలోని ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన మిగతా చిత్ర యూనిట్ సభ్యులు సహాయక చర్యలు చేపట్టి, వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారి సత్వర స్పందనతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో పడవలోని ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన మిగతా చిత్ర యూనిట్ సభ్యులు సహాయక చర్యలు చేపట్టి, వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తమిళ నటుడు సూరి హీరోగా నటిస్తోన్న చిత్రమిది. టాలీవుడ్ నటుడు సుహాస్ విలన్గా కనిపించనున్నారు. ఈ సినిమాతో సుహాస్ కోలీవుడ్లో అడుగుపెట్టనున్నారు. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో దీన్ని వెట్రిమారన్ నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో సుహాస్ అక్కడ ఉన్నారా? లేరా? అనే విషయంపై సినిమా యూనిట్ స్పందించాల్సి ఉంది.