నేచురల్ స్టార్ నాని కొన్నాళ్ల క్రితం ఉన్న దూకుడు ఇప్పుడు ప్రదర్శించడం లేదు. అప్పట్లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదలయ్యేవి. బట్ ఇకపై యేడాదికి ఒకటీ లేదా రెండు సినిమాలతో సరిపెట్టాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో 2025కి హిట్ 3 వచ్చేసింది. ఇక 2026 మార్చి లో ద ప్యారడైజ్ విడుదల చేస్తాం అని ప్రకటించారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయబోతోన్న ఈ మూవీ చిత్రీకరణలో ఈ నెలాఖరు నుంచి పాల్గొనబోతున్నాడు నాని. 1980ల కాలం నాటి కథతో ఈ చిత్రం రూపొందబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఆ కాలాన్ని ప్రతిబింబించేలా కొన్ని సెట్స్ వేశారు. ఆ సెట్స్ లోనే నాని అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఈ మూవీతో పాటు మరో ప్రాజెక్ట్ ను కూడా మొదలుపెట్టాడు నాని.
హిట్ 3 ప్రమోషన్స్ టైమ్ లోనే శ్రీకాంత్ అడ్డాల తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సుజిత్ డైరెక్షన్ లో ఉంటుందని చెప్పాడు. సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓ.జి మూవీ చేస్తున్నాడు. ఎప్పుడో మొదలైన ఈ మూవీ పవన్ మరో మూడు వారాలు టైమ్ ఇస్తే షూటింగ్ పూర్తవుతుంది. ఆ టైమ్ ను పవన్ ఇవ్వలేకపోతున్నాడు. ఆ కారణంగానే ఆగిపోయింది. అయినా అతనూ నాని ప్రాజెక్ట్ ను మొదలుపెట్టేశాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయిన ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయట. మరికొన్ని రోజుల్లోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తవుతుంది. ఆ తర్వాత వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే నాని ఒకేసారి ప్యారడైజ్ మూవీతో పాటు సుజిత్ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటాడు. సో.. 2026లో అతన్నుంచి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయన్నమాట.