Sukumar: తన ఫేవరెట్ సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్న సుకుమార్..
Sukumar: వన్ సైడ్ లవ్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్.;
Sukumar: వన్ సైడ్ లవ్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్. ఎందుకో.. ఇండస్ట్రీ అంతా ఒకవైపు వెళ్తుంటే.. నా రూటే సెపరేటు అన్నట్టుగా సుకుమార్ మాత్రం తన పంతాలోనే సినిమాలు చేస్తుంటాడు. అందుకే ఆయన టేకింగ్‌కు, డైరెక్షన్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. చాలావరకు తన సినిమాలు అందరికీ ఫేవరెట్‌గా నిలిచిపోతాయి. అలాంటి ఒక సినిమా సీక్వెల్‌ను ఇటీవల అధికారికంగా ప్రకటించాడు సుకుమార్.
లెక్కల మాస్టర్ అని ప్రేక్షకుల చేత ప్రేమగా పిలిపించుకునే సుకుమార్.. తన ప్రతీ సినిమాలో అన్ని ఎమోషన్స్ సమపాళ్లలో సరిపోయేలా చూసుకుంటాడు. తాను తెరకెక్కించిన చిత్రాల్లో ఆర్య 2 తన ఫేవరెట్ అని ఇప్పటికే చాలా సందర్భాల్లో సుకుమార్ అన్నాడు. అది బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ చాలామంది వన్ సైడ్ లవర్స్‌కు ఇది పర్సనల్ ఫేవరెట్‌గా నిలిచిపోయింది. దానికి సీక్వెల్ ఉంటే బాగుంటుందని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు సుకుమార్.
ఇటీవల ఆడియన్స్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో సుకుమార్ ఆర్య3 గురించి బయటపెట్టాడు. ఆర్య 3 స్ర్కిప్ట్ సిద్ధమవుతోందని, త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని సుకుమార్ వెల్లడించాడు. కాగా ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. ఇది ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత అల్లు అర్జున్‌కు ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక ఆర్య 3 సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుంది.