మళయాల బ్లాక్ బస్టర్స్ కు తెలుగు ఆడియన్స్ లోనూ మంచి క్రేజ్ పెరుగుతోంది. రీసెంట్ గా మార్క్ అనే బ్లడ్ బాత్ లాంటి మూవీని మనవాళ్లూ ఆదరించారు. ఇక మాలీవుడ్ లో ఎక్కువగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఉంటాయి. మైండ్ కు పనిచెప్పే సినిమాలు ఎక్కువ కనిపిస్తాయి. ఆ తరహాలో రూపొందిన మూవీనే ‘ఐడెంటిటీ’. టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 2న విడుదలై అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆద్యంతం కట్టిపడేసే కథనంతో మెప్పించిన సినిమా ఇది. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ ద్వయం ఈ మూవీని డైరెక్ట్ చేశారు.
టోవినో ఇప్పుడిప్పుడే తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. త్రిష అంటే మనకు ఒకప్పటి టాప్ హీరోయిన్. సో ఈ క్రేజ్ ను తెలుగులోనూ క్యాష్ చేసుకునేందుకు ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ నెల 24న ఐడెంటిటీ తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఓ రకంగా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనే రివ్యూస్ వచ్చాయీ చిత్రానికి. ఇక 24న అస్సలు పోటీ కూడా లేదు కాబట్టి ఐడెంటిటికి సరైన ఛాన్స్ అనుకోవచ్చు. మరి ఈ మూవీ తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.