Supritha : అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది : సురేఖ వాణి కూతురు
Supritha : రెండో పెళ్లి అనేది పూర్తిగా తన అమ్మే నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చింది సుప్రీత. తనకైతే రెండో పెళ్లి చేయాలనే ఉందని చెప్పుకొచ్చింది.;
Supritha : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తల్లి, వదిన, అక్క వంటి పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంటుంది. ఇక ఆమె కూతురు సుప్రిత కూడా అందరికీ సుపరిచితురాలే.. సుప్రిత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో అయితే ఆమెకి వీపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తనతల్లితో కలిసి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తోంది సుప్రిత. అయితే ఆ మధ్య సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటికి గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు సురేఖ.
అయితే తన తల్లి రెండో పెళ్లి పైన సుప్రీత స్పందించింది. ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సుప్రీత మాట్లాడుతూ... రెండో పెళ్లి అనేది పూర్తిగా తన అమ్మే నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చింది సుప్రీత. తనకైతే రెండో పెళ్లి చేయాలనే ఉందని చెప్పుకొచ్చింది. ఏం జరుగుతుందో అన్నది టైం డిసైడ్ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం తన కెరీర్ పైన అమ్మ ఫోకస్ చేసిందని, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నామని వెల్లడించింది. అలాగే తన తండ్రి మరణించిన రోజు జరిగిన సంఘటనలను తలచుకుంటూ ఎమోషనల్ అయింది. తన తండ్రికి తలకొరివి పెట్టడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదని, తానే పెట్టేశానని తెలిపింది.