Surekha Konidela: ట్విటర్‌లో సురేఖ కొణిదెల..! ఇక్కడే అసలైన ట్విస్ట్..

Surekha Konidela: మెగాస్టార్ సతీమణి సురేఖ కూడా ఇటీవల ట్విటర్‌లోకి అడుగుపెట్టారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.;

Update: 2022-02-28 09:11 GMT

Surekha Konidela: సెలబ్రిటీలంతా తమ అభిమానులకు దగ్గరగా ఉండడానికి ఎక్కువగా సోషల్ మీడియానే ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో వారి ప్రొఫెషనల్ విషయాలను మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటూ ఉంటారు తారలు. సెలబ్రిటీలు మాత్రమే కాదు.. వారి ఫ్యామిలీ కూడా సోషల్ మీడియాలో భాగస్వాములు అవ్వడానికి ఇష్టపడతారు. అలాగే మెగాస్టార్ సతీమణి సురేఖ కూడా ఇటీవల ట్విటర్‌లోకి అడుగుపెట్టారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.

మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో అడుగుపెట్టి కొంతకాలమే అయ్యింది. కానీ ఇతర మెగా హీరోలతో పోటీపడే రేంజ్‌లో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ఇతర హీరోలలాగా కాకుండా మెగాస్టార్.. ఆయన మనసుకు నచ్చిన ప్రతీ ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఇష్టపడతారు. అందుకే ఆయనకు ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. తాజాగా ఆమె సతీమణి సురేఖ కూడా ట్విటర్‌లో అడుగుపెట్టి 'భీమ్లా నాయక్' గురించి ఓ పోస్ట్ కూడా వేశారు.

సురేఖ కొణిదెల ట్విటర్‌లో అడుగుపెట్టిన కాసేపటికే మెగా అభిమానులంతా ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అలా కాసేపట్లోనే వేలల్లో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు సురేఖ. కానీ ప్రస్తుతం ఆ ట్విటర్ అకౌంట్ ఫేక్ అనే కథనాలు వినిపిస్తున్నాయి. సురేఖ ట్విటర్ అకౌంట్‌ను మెగా హీరోలెవరూ ఫాలో అవ్వకపోవడం ఈ అనుమానం నిజమే అనుకునేలా చేస్తోంది. అంతే కాకుండా కొణిదెల పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండడంతో ఇది కచ్చితంగా ఫేక్ అకౌంట్ అని కొందరు నిర్దారించేస్తున్నారు.

Tags:    

Similar News