Alia Bhatt : ఇకపై అలాంటి సినిమాలు మాత్రమే చేస్తా - అలియా భట్

Update: 2025-09-05 14:15 GMT

బాలీవుడ్ స్టార్ అలియా భట్ సినిమాల్లో తన పాత్రల ఎంపిక విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నారు. తన కూతురు రాహా కోసం ఇకపై తాను కామెడీ, కుటుంబం అంతా కలిసి చూడదగిన సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే అలియా, తాజాగా తన కెరీర్, కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కూతురు కోసం సినిమా జానర్ మార్పు:

'రాజీ', 'డియర్ జిందగీ', 'గంగూబాయి కాఠియావాడి' వంటి చిత్రాలతో తన నటనకు ప్రశంసలు అందుకున్న అలియా భట్.. ఇకపై భిన్నమైన కథలను ఎంచుకుంటానని చెప్పారు. "నేను ఇప్పటి వరకు రాహా చూసి ఎంజాయ్ చేసే సినిమాలు చేయలేదు. అందుకే తనను నవ్వించేలా, సంతోషపెట్టేలా సినిమాలు చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా కామెడీ కథలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నా. నా కూతురే ఈ నిర్ణయానికి ఒక కారణం. ఆమె కోసమే నా సినిమా జానర్ మార్చుకుంటున్నాను. కొన్ని ప్రాజెక్ట్‌లకు అంగీకరించాను, వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను" అని అలియా భట్ తెలిపారు.

పని, కుటుంబం మధ్య బ్యాలెన్స్:

బిజీ షెడ్యూల్, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడం అలవాటుగా మారిందని అలియా చెప్పారు. భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటిస్తున్న 'లవ్ అండ్ వార్' సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, "మేమిద్దరం షూటింగ్‌కు వచ్చినప్పుడు రాహాను చూసుకోవడం సవాలుగా మారింది. మేము ఎక్కువగా రాత్రి సమయాల్లోనే షూటింగ్ చేశాం. పగలంతా రాహాతో ఉండి, రాత్రి షూట్‌కు హాజరయ్యేవాళ్లం. ఆమె కోసం షెడ్యూల్ మార్చుకున్నాం. సెట్‌లో మేమిద్దరం కలిసి ఉన్న రోజులు చాలా తక్కువ. రాహా కూడా సెట్స్‌కు వచ్చినప్పుడు మాతోపాటు ఎంజాయ్ చేసేది" అని వివరించారు.

Tags:    

Similar News