తనను సైకిల్ ఎక్కించి ఊరంతా తిప్పిన దర్శకుడికి ఆ హీరో ఏకంగా ఓ కాస్ట్ లీ కార్ నే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ హీరో కార్తీ. దర్శకుడు ప్రేమ్ కుమార్ సి. విజయ్ సేతుపతి, త్రిష జంటగా 96 అనే మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన ప్రేమ్ కుమార్ కు తర్వాత కార్తీ ఛాన్స్ ఇచ్చాడు. ఆఛాన్స్ ను కూడా అందంగా ఉపయోగించుకున్న ప్రేమ్ కుమార్ అతనికి ‘మేయాళగన్’అనే మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందించాడు. ఈ చిత్రాన్నే తెలుగులో సత్యం సుందరంగా డబ్ చేశారు. తెలుగులోనూ మంచి రివ్యూస్ అందుకుందీ చిత్రం. విశేషం ఏంటంటే.. ఈ మూవీన నిర్మించింది కార్తీ అన్న సూర్య. ఆ ఇద్దరూ కలిసే ఈ దర్శకుడికి ఈ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే ఈ కార్ గిఫ్ట్ వెనక కూడా ఓ కథ ఉంది. ఆ కథ వల్లే ఈ కార్ వచ్చింది.
ప్రేమ్ కుమార్ కు ఫైవ్ డోర్ థార్ కార్ అంటే చాలా ఇష్టమట. ఖరీదైన ఆ కార్ ను కొనుక్కోవాలనుకుని డబ్బులు దాచుకున్నాడు. కానీ బుక్ చేసిన యేడాదికి కానీ ఆ కార్ రాదు. ఈ లోగా అతని వద్ద డబ్బులు అయిపోతున్నాయట. ఆ విషయమే ఓ సారి సూర్యకు చెప్పాడట. అది మనసులో పెట్టుకున్న నిర్మాత, హీరో కలిసి ఈ డైరెక్టర్ కు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ గా అతను మనసుపడ్డ కార్ ను అందించారు. కార్ అందుకున్న ఆనందాన్ని చాలా సంతోషంగా పంచుకున్నాడు ప్రేమ్ కుమార్.
ఇక సత్యం సుందరం సినిమాలో కార్తీ తండ్రికి మరో హీరో అరవింద్ స్వామి చిన్నప్పుడే ఇచ్చిన ఓ సైకిల్ వల్ల అతని లైఫ్ స్టైల్ మారిపోతుంది. అందుకే ఆ సైకిల్ ను తను పెద్దయ్యాక కూడా చాలా భద్రంగా దాచుకుంటాడు. అరవింద్ స్వామి తన ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి అదే సైకిల్ పై ఊరంతా చక్కర్లు కొడుతూ అనేక జ్ఞాపకాలను పంచుకుంటారు. ఓ రకంగా సినిమా విజయంలో ఈ సైకిల్ ది కూడా కీలక పాత్రే. సో.. తమకు సైకిల్ తో సూపర్ హిట్ ఇచ్చినందుకు అన్నదమ్ములిద్దరూ ప్రేమ్ కుమార్ కు మర్చిపోలేని బహుమతి అందించారన్నమాట.