కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సినిమా కంగువపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు శివ అధి నారాయణ దర్శకుడు కాగా.. యూవీ క్రియేషన్స్, స్టుడియో గ్రీన్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ కు ఇదే తొలి స్ట్రయిట్ తమిళ సినిమా కావడం విశేషం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతోంది. ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో కంగువపై అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. దసరా కానుకగా అక్టోబర్ 10న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అప్పుడే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వెట్టయాన్ మూవీ రిలీజ్ ఉండటంతో వాయిదా వేస్తున్నట్టు స్వయంగా సూర్యనే వెల్లడించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎట్టకేలకు రివిల్ చేశారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. బాబీడియోల్, ఆరాషా తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.