సూర్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. నాన్ స్టాప్ గా దూసుకుపోతున్నాడు. అయితే కొన్నాళ్లుగా ఫ్లాప్స్ మాత్రమే చూస్తున్నాడు సూర్య. వాటిని దాటుకుని ఇకపై చేసే చిత్రాలు కూడా ఉండబోతున్నాయి అనిపిస్తున్నాడు. కరుప్పు మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు మరో సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు. అదే వెంకీ అట్లూరి మూవీ. ఫస్ట్ టైమ్ తెలుగు మూవీ చేస్తున్నాడు సూర్య. ఈ మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు. అతని మూవీ నంబర్ 46 అన్నట్టుగా మాత్రమే మాట్లాడుతున్నారు.
ఇక ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. కేవలం మూడు రోజులు చిత్రీకరణ చేస్తే షూటింగ్ అయిపోతుంది అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ లో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ మూడు రోజులు తర్వాత ఆయన మూవీ అయిపోతుంది అని టాక్. ఇక మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. రవీనా టాండన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. తనకు ఇది స్పెషల్ మూవీగా అవుతోంది. తను హీరోయిన్ గా తెలుగు మూవీస్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం కొత్తతరహాలో కనిపించబోతోంది.
ఇక ఈ మూవీతో పాటు మళయాలంలో ఆవేశం మూవీ డైరెక్టర్ జీతూ మాధవన్ తోనూ ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ మూవీ రీసెంట్ గానే ఓపెనింగ్ జరుపుకుంది. నజ్రియా నజీమ్ హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ చిత్రంలో నాస్లేన్, జాన్ విజయ్ కీలక పాత్రలు చేస్తున్నాడు. సో..తెలుగు మూవీ తర్వాత సూర్య మళయాలం మూవీ చేస్తున్నాడు. మరి ఈ స్థాయిలో తన రేంజ్ కూడా పెంచుకోబోతున్నాడా అనిపిస్తోంది కదా.