Retro Trailer : రెట్రో ట్రైలర్.. ఆడు అందరి పల్స్ పట్టేశాడు

Update: 2025-04-19 04:51 GMT

సూర్య, పూజాహెగ్డే జంటగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమా రెట్రో.ప్రకాష్ రాజ్, జోజూ జార్జ్, నాజర్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.మే 1న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. కంగువా వంటి ఎపిక్ డిజాస్టర్ తర్వాత సూర్య చేసిన సినిమా ఇది. అందుకే అంచనాలున్నాయి.పైగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ అంటే అతనికీ రెండు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. కార్తీక్ టేకింగ్, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే రెట్రో గ్యారెంటీగా హిట్ అవుతుందనుకుంటున్నారు. దీనికి తోడు సూర్య చాలాకాలం తర్వాత తనదైన మాస్ లుక్ తో పాటు మాస్ కంటెంట్ తో వస్తున్నాడు.

ఇక ట్రైలర్ చూస్తే పుట్టినప్పటి నుంచి రౌడీ అయిన 'పారి'.. రుక్మిణితో ప్రేమలో పడిన తర్వాత జీవితం మార్చుకోవాలనుకుంటాడు.ఆ మేరకు ఆమెకు మాట కూడా ఇస్తాడు. కానీ నిలబెట్టుకోలేడు. అందుకు దారి తీసిన పరిస్థితులేంటీ.. ఎందుకు అతను తన గత జీవితాన్ని వదిలించుకోలేకపోతున్నాడు అనే కోణంలో సాగే కథలా ఉంది. ట్రైలర్ లోనే డైలాగ్స్ బావున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ సూర్యను చాలా అంటే చాలా కొత్తగా చూపించబోతున్నాడనేది తెలుస్తోంది. ఈ తరహా పాత్రలు సూర్యకు కొత్తేం కాదు. కానీ ఈ దర్శకుడు ఎలా చూపించబోతున్నాడా అని ఎదురుచూసిన వారికి ట్రైలర్ తోనే ఆన్సర్ దొరికేసింది.

ఇక జోజూ జార్జ్,ప్రకాష్ రాజ్, జయరాం పాత్రలు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఈ పాత్రల చుట్టే సూర్య జీవితం ఎక్కువగా సాగేలా ఉంది.కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో సంగీతం కూడా కొత్తగా ఉంటుంది. అది మరోసారి తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ అతనికి కావాల్సిన మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్రెడీ వచ్చిన ఓ పాట ఊపేస్తోంది. ఇక మే 1న ఈ సారి సూర్య ఫ్యాన్స్ కూడా కాలర్ ఎగరేసుకునేలా చేస్తాడా లేదా అనేది చూడాలి.

Full View

Tags:    

Similar News