Vijay Devarakonda : కింగ్ డమ్ సాలిడ్ ఓపెనింగ్స్ ఉన్నాయిగా

Update: 2025-07-30 04:59 GMT

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఓపెనింగ్స్ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు విజయ్. పైగా అతనిపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారు కొందరు. ఇవన్నీ కింగ్ డమ్ ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తాయి అనుకున్నారు. బట్ అదేం కనిపించడం లేదు. కింగ్ డమ్ కు సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇండియాలోనే కాదు.. ఓవర్శీస్ లో కూడా ఓ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో 20వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. ఇంకా రష్ కొనసాగుతూ ఉంది. ఇటు తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ వేస్తారు అనుకున్నారు. బట్ ఇక్కడ అవకాశం లేకపోయింది. అందుకే గురువారం మార్నింగ్ షోస్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. అన్ని మల్టీ ప్లెక్స్ లు ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి. అన్ని బుకింగ్ యాప్స్ లోనూ కింగ్ డమ్ కు పూర్తి స్థాయిలో బుకింగ్స్ కనిపిస్తున్నాయి.

గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయడం, సితార బ్యానర్ కావడం కూడా ఈ మూవీ ఓపెనింగ్స్ కు మరో కారణం అనుకోవచ్చు. ప్రమోషన్స్ తక్కువగానే చేసినా.. క్రేజ్ బాగా వచ్చింది. పైగా ఈ సారి విజయ్ పై సింపతీ కూడా పెరిగింది. దీనికి తోడు అందరు హీరోల అభిమానులూ తన సినిమా ఆడాలని కోరుకుంటున్నారని విజయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం.. అందరికీ పేరు పేరునా థ్యాంక్స్ చెప్పడం, తన స్పీచ్ లో ఎక్కడా గతంలో కనిపించిన తప్పిదాలు లేకపోవడం ఇవన్నీ కలిసొచ్చాయి అనే చెప్పాలి. మొత్తంగా ఈ రేంజ్ ఓపెనింగ్స్ ను మూవీ టీమ్ కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండదు. అందుకే సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ గా మారుతుందని చెప్పొచ్చు. 

Tags:    

Similar News