Taamannaah Bhatia : సోలో వద్దు.. గ్లామరే ముద్దు..

Update: 2025-04-24 09:00 GMT

కొన్ని పాత్రలకు ఆయా ఆర్టిస్టుల ‘స్టేచర్’ కూడా చాలా ముఖ్యం. ఆ పాత్రలకు తగ్గ కటౌట్ వీరిలో ఉందా లేదా.. ఆ పాత్రకు తగ్గ హుందాతనం తెచ్చే సత్తా వీరి నటనలో ఉందా అనేదే కొన్ని కథలకు పెద్ద ప్రాధాన్యత అవుతుంది. ప్రధానంగా లేడీ ఓరియంటెడ్ కథలకు సంబంధించి. ఆ స్టేచర్ ఉన్నవాళ్లు ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీస్ తో స్టార్డమ్ తెచ్చుకుంటారు. నాటి విజయశాంతి నుంచి నేటి నయనతార, అనుష్క వరకూ అలా సాధించిన వారే. విశేషం ఏంటంటే.. ఈ కథలకు ముందు వీళ్లూ పూర్తిస్థాయిలో గ్లామర్ హీరోయిన్లుగా ఆకట్టుకున్నారు. వారి కోవలో ప్రయత్నించిన త్రిష, హన్సిక, కీర్తి సురేష్ వంటి వారు పెద్దగా మెప్పించలేకపోయారు. లేటెస్ట్ గా మరో బ్యూటీ క్వీన్ తమన్నా భాటియా కూడా సోలో హీరోయిన్ గా సత్తా చాటాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తను మెయిన్ లీడ్ గా కనిపించిన ఓదెల 2 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. సంపత్ నంది ఏం చెప్పి తనను ఒప్పించాడో కానీ.. హ్యాపీగా ఐటెమ్ సాంగ్స్ చేసుకుంటూ అందాలారబోసుకుంటోన్న అమ్మడిని సడెన్ గా అఘోరీగా మార్చాడు. ఈ గెటప్ సూట్ కాలేదు. తన నటన ఆ పాత్రకు తగ్గ స్టేచర్ తేలేదు. ఇటు కథ, కథనాల్లోని లోపాల వల్ల మరింత మైనస్ అయింది. కట్ చేస్తే సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.

అందుకే ఇకపై సోలో హీరోయిన్ పాత్రలకు స్వస్తి చెప్పాలని ఫిక్స్ అయిందట తమన్నా. కేవలం గ్లామర్ పాత్రలు ఉంటే చాలు అనుకుంటోంది. అలాగే నటనకు కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్రలైనా ఓకే చెప్పాలనుకుంటోందట. నిజానికి అఘోరీ అనే పాత్ర అందరికీ సూట్ కాదు. ముఖ్యంగా విపరీతమైన గ్లామర్ రోల్స్ చేసిన హీరోయిన్లకు. అదే మైనస్ అయింది తమన్నాకు కూడా. మరి ఇకపై తను ఓన్లీ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఓకే చెబుతుందన్నమాట. సో.. విషయం చాలా త్వరగానే అర్థం అయింది తనకు. దీని వల్ల అనవసర ప్రయోగాలు కూడా ఆగుతాయి.

Tags:    

Similar News