Taapsee Pannu : తన శృంగార జీవితంపై తాప్సీ ఏమన్నదో తెలుసా..?

Taapsee Pannu : తాప్సీ పన్నూ తన మనసులోని భావాలను ప్రకటించడానికి భయపడదు అని మరోసారి రుజువైంది.

Update: 2022-08-08 16:16 GMT

Taapsee Pannu : తాప్సీ పన్నూ తన మనసులోని భావాలను ప్రకటించడానికి భయపడదు అని మరోసారి రుజువైంది. తాజాగా సినీ విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు ఆమె ధీటైన సమాధానం ఇచ్చింది. కరణ్ జోహర్‌ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్‌షో అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం దొబారా సినిమా ప్రమోషన్స్‌లో ఆమె మీడియాతో కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ విలేఖరి.. 'మీకు కాఫీ విత్ కరణ్ ప్రొగ్రామ్ నుంచి ఆహ్వానం అందలేదా' అని తాప్సి పన్నూను ప్రశ్నించారు. 'కాఫీ విత్ కరణ్‌లో అంతా శృంగారం గురించే ప్రశ్నలడుగుతారు. నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా ఏమీ ఉండదు' అని తాప్సి సమాధానం ఇచ్చింది. ఇది విన్న అక్కడి సినీ రిపోర్టర్స్ అంతా షాక్ అయ్యారు. కొందరైతే ఇది కరణ్ జోహర్‌కు మంచి కౌంటర్ అనుకున్నారు.

ఇటీవళ ప్రారంభమైన కాఫీ విత్ కరణ్ ప్రొగ్రాం హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ ప్రోగ్రాంపై సోషల్ మీడియాలో కూడా చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. నటీనటుల ప్రయివేటు లైఫ్‌పై శ్రుతిమించిన ప్రశ్నలడుగుతున్నారనే అభిప్రాయం వెల్లడవుతోంది. 

Tags:    

Similar News