కొన్నాళ్లుగా తమన్నా అన్ని హద్దులు చెరిపేస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి లిప్ లాక్ లకు దూరం అంది. కొన్నాళ్ల క్రితం తన మాజీ లవర్ తో చేసిన మూవీలో లిప్ లాక్ లే కాదు.. ఇంటిమేట్ సీన్స్ తోనూ రెచ్చిపోయింది. అలాగే ప్రత్యేక పాటల్లో కూడా అంతకు ముందుకంటే ఎక్కువ స్కిన్ షో చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో తను ఏకంగా ఓ బోల్డ్ మూవీకే సైన్ చేసింది. అది కూడా ఏక్తా కపూర్ ప్రొడక్షన్ లో. ఏక్తా కపూర్ అంటే సెమీ పోర్న్ మూవీస్ ను కూడా ప్రొడ్యూస్ చేస్తోంది కదా. రీసెంట్ గానే అలాంటి వీడియోస్ నే రూపొందించే తన ఆల్ట్ బాలాజీ యాప్ ను ప్రభుత్వం బ్యానర్ చేసింది. పైగా ఇది ఫ్రాంఛైజీ మూవీ కూడా విశేషం. ఏక్తా కపూర్ 2011లో నిర్మించిన ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్’మూవీ సంచలన విజయం సాధించింది. 2014లో సన్నిలియోన్ ప్రధాన పాత్రలో ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2’ కూడా విజయం సాధించింది. ఈ రెండూ ఎరోటిక్ హారర్ మూవీస్ గానే సక్సెస్ అయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ ఫ్రాంఛైజీని కంటిన్యూ చేస్తూ ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ 3’ చేయబోతోంది ఏక్తా కపూర్. ఈ మూడో భాగంలోనే తమన్నా నటించబోతోంది.
ఇది కూడా పూర్తిగా ఎరోటిక్ హారర్ మూవీగానే రూపొందబోతోంది. అంటే విపరీతమైన ఎక్స్ పోజింగ్ తో పాటు లెక్కలేనన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. అవన్నీ తెలిసే తమన్నా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందీ అంటున్నారు. నిజానికి తమన్నా కెరీర్ ఇంకా అయిపోలేదు. కాస్త ప్రయత్నిస్తే సౌత్ లోనూ మంచి ఆఫర్స్ వస్తాయి. అవీ కాదంటే స్పెషల్ సాంగ్స్ తోనూ దుమ్మురేపే సత్తా ఉంది. అయినా ఇలాంటి మూవీస్ కు ఓకే చెబుతోంది అంటే తన మైండ్ సెట్ ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.