Megastar Chiranjeevi : మెగాస్టార్ చిందులేయబోతోన్న తమన్నా

Update: 2025-11-12 06:03 GMT

మెగాస్టార్ చిందులేయడానికి సిద్ధం అవుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. యస్.. కొన్నాళ్లుగా తెలుగులో పెద్దగా మార్కెట్ చేసుకోలేకపోతోంది తమన్నా. గతంలో చిరంజీవితో నటించిన భోలే శంకర్ లో హీరోయిన్ గా నటించిన తను ఈసారి అతనితో ఓ ఐటమ్ సాంగ్ చేయబోతోంది. హిందీలో ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టిన తను తెలుగులో కూడా ఈ ఛాన్స్ ను అందుకోవాలనుకుంటోంది.

ఇంతకీ చిరంజీవి చేస్తోన్న ఐటమ్ సాంగ్ ఎవరి మూవీలో అంటే.. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో. యస్.. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ పాటలో తమన్నాను తీసుకోవాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ పాట సెట్స్ లోకి వెళ్లబోతున్నారు. తమన్నా గతంలో చాలా స్పెషల్ సాంగ్స్ చేసింది కాబట్టి ఇదేం కొత్త విషయమేం కాదు. కాకపోతే మెగాస్టార్ తో చిందులేయడం అనేది మాత్రం స్పెషల్ మేటర్ అని చెప్పాలి.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోలో చేస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో ఇస్తోన్న సాంగ్స్ లో ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ బ్లాక్ బస్టర్ అవుతోంది. మొత్తంగా మెగాస్టార్ తో తమన్నా ఇస్తోన్న సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది చూడాలి. 

Tags:    

Similar News