Tandel Collections : తండేల్ మూవీ 6 రోజుల కలెక్షన్స్

Update: 2025-02-13 11:00 GMT

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా తండేల్. బన్నీ వాసు నిర్మాత. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ నెల 7న విడుదలైన తండేల్ కు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ముఖ్యంగా నాగ చైతన్య నటనకు జనం ఫిదా అవుతున్నారు. బుజ్జితల్లిగా సాయి పల్లవి మరోసారి నటనతో మెస్మరైజ్ చేసింది. చాలా రోజుల తర్వాత ఓ లవ్ స్టోరీని తన మ్యూజిక్ తో మరో మెట్టు పైన నిలబెట్టాడు దేవీ శ్రీ ప్రసాద్. ప్రతి పాటా ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం నెక్ట్స్ లెవల్ అనిపించుకుంది.

ఇక ఈ మూవీతో చైతన్యను ఫస్ట్ వంద కోట్ల క్లబ్ లో చేరుస్తాం అని రిలీజ్ కు ముందే చెప్పాడు బన్నీవాసు. ఆ మాట నిజం అయ్యే దిశగా వెళుతోంది తండేల్ కలెక్షన్స్ తో. రోజు రోజుకూ పెరుగుతూ వెళుతున్న కలెక్షన్స్ తో ఈ చిత్రం 6 రోజుల్లో 86 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థే అఫీషియల్ గా ఓ పోస్టర్ విడుదల చేసింది. కొన్నాళ్లుగా ఫేక్ కలెక్షన్స్ వస్తోన్న నేపథ్యంలో తాము మాత్రం ఆ జోలికి వెళ్లడం లేదని కాస్త జాగ్రత్తగానే ఈ ఫిగర్స్ ను విడుదల చేస్తున్నారు.

మరోవైపు తండేల్ పైరసీ కూడా వీరిని ఇబ్బంది పెడుతోంది. ఏకంగా ఆర్టీసి బస్సుల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. నిర్మాతలు అలాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నా ఎవరూ ఆగడం లేదు.


Tags:    

Similar News