Tarakaratna : తారకరత్నకు కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ నివాళి
తారకరత్న పార్దివదేహాన్ని చూసి భావోద్వేగానికి లోనైన ఎన్టీఆర్.. బరువెక్కిన గుండెతో అన్నకు నివాళులు అర్పించారు.;
తారకరత్న పార్దివదేహాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. బరువెక్కిన గుండెతో తారకరత్నకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ను విజయ సాయిరెడ్డి ఓదార్చారు. అనంతరం కొంత సమయం విజయ సాయిరెడ్డి, ఎన్టీఆర్ మాట్లాడుకుంటూ కనిపించారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి తారకరత్న ఇంటికి చేరుకుని నివాళులర్పించారు.
సోమవారం ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న పార్ధివదేహం తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్ధం రేపు ఫిల్మ్ ఛాంబర్‌లో తారకరత్న భౌతికకాయం ఉంచనున్నారు. రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్ర 4గంటల వరకు తారకరత్న పార్ధివదేహం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నట్లు కుటుంబ స భ్యులు తెలిపారు. ఇక సాయంత్రం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించను న్నారు. నటుడు తారకరత్నకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని తారకరత్న నివాసం మోకిలకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.