హనుమాన్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడే తేజ సజ్జా. బాల నటుడుగా కెరీర్ మొదలుపెట్టి హీరోలుగా మారిన ఎవ్వరికీ ఈ ఇమేజ్ రాలేదు అనే చెప్పాలి.హను మాన్ అతని స్థాయిని పెంచింది. అందుకే ఆ స్థాయిని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు మరో ప్యాన్ ఇండియా మూవీతో రాబోతున్నాడు. 'మిరాయ్' అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఆ మధ్య విశ్వక్ సేన్ తో అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో మెరిసిన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ టైమ్ కు సాధ్యం కాదనుకున్నారు. పైగా పోటీకూడా ఉంది. అందుకే జూలై 4న రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ లేటెస్ట్ గా ఆ డేట్ నుంచి కూడా తప్పుకున్నారు. ఆగస్ట్ 1న రిలీజ్ చేయబోతున్నాం అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.
బుద్ధుడి కాలంలో ఉన్న కొన్ని రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.పీరియాడిక్ ఫాంటసీ మూవీగా చెప్పొచ్చు. రితికా నాయక్ కూడా పవర్ ఫుల్ రోల్ లోనే కనిపించబోతోందని ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేసిన తీరు చూస్తే తెలుస్తుంది. మొత్తంగా తేజ సజ్జా ఈ మూవీతో మరోసారి ప్యాన్ ఇండియా హీరో అనిపించుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు.