Murugadoss : బాలీవుడ్ లో తెలుగు డైరెక్టర్ వర్సెస్ తమిళ్ డైరెక్టర్

Update: 2025-03-25 11:15 GMT

తెలుగు డైరెక్టర్ వర్సెస్ తమిళ్ డైరెక్టర్.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే టాపిక్ వినిపిస్తోంది. ఇదే మాట మనమూ అనడం ఎంత వరకు కరెక్ట్ అనేది చెప్పలేం కానీ.. ఈ మాట పాజిటివ్ గా వాడొచ్చు. ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ ఈ ఇద్దరు సౌత్ డైరెక్టర్స్ పై ఆధారపడి ఉన్నారు అని. యస్.. తెలుగు నుంచి గోపీచంద్ మలినేని, తమిళ్ నుంచి ఏఆర్ మురుగదాస్ బాలీవుడ్ లో తమ లక్ చెక్ చేసుకోబోతున్నారు. అయితే మురుగదాస్ గతంలోనే గజినీతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కాకపోతే ఇప్పుడు ఫామ్ లో లేడు. అందుకే ఈ మూవీ అతనికి చాలా కీలకంగా ఉంది. అదే టైమ్ లో సల్మాన్ ఖాన్ కు కూడా.

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో మురుగదాస్ రూపొందించిన సినిమా సికందర్. ఈ నెల 30న ఈద్ కానుకగా విడుదలవుతోందీ సినిమా. పూర్తిగా సౌత్ మాస్ మూవీస్ ఫ్లేవర్ లో మురుగదాస్ స్టైల్లో రూపొందినట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమైంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఓ సందేశం కూడా మిక్స్ అయి ఉన్నట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ పీపుల్ సౌత్ మూవీస్ లో ఏ అంశాలను ఇష్టపడుతున్నారో అవన్నీ ఈ చిత్రంలో మిక్స్ అయ్యాయని అర్థం అవుతోంది. ఇక ఈ మూవీ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు కూడా చాలా కీలకం కాకపోతే ఆశించినంత బజ్ క్రియేట్ కాలేదింకా. మౌత్ టాక్ తోనే సికందర్ పికప్ కావాలేమో.

ఇక తెలుగులో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న గోపీచంద్ మలినేని అనూహ్యంగా బాలీవుడ్ ఒకప్పటి మాస్ స్టార్ సన్నీడియోల్ తో సినిమా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మించిన ఈ మూవీని ముందుగా రవితేజతో చేయాలనుకున్నారు. అతను నో చెప్పడంతో ఏకంగా సన్నిడియోల్ ను ఒప్పించాడు. సన్ని డియోల్ హీరోగా చాలాకాలం క్రితమే రిటైర్ అయ్యాడు. అయితే అతని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన గదర్ సీక్వెల్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అతనికి తిరుగులేని పాపులారిటీ ఉంది. బాలీవుడ్ బాలయ్య అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ట్యాగ్ కు తగ్గట్టుగానే గోపీచంద్ అతనితో జాట్ అనే సినిమా రూపొందించాడు. రీసెంట్ గా వచ్చిన ఈ ట్రైలర్ కు బాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. రణ్ దీప్ హుడా విలన్ గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, రమ్యకృష్ణ కూడా ఉన్నారు. ఊరమాస్ తెలుగు సినిమాల్లా కనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ పూర్తిగా సన్నిడియోల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టుగా కనిపిస్తోంది. జాట్ ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.

సో.. ఈ ఇద్దరు సౌత్ డైరెక్టర్స్ కు బాలీవుడ్ లో ఓ ఇన్ డైరెక్ట్ పోటీ కనిపిస్తోంటే.. వీరిపైనే ఆ హీరోలు హిట్ కొట్టి నెక్ట్స్ లీగ్ లోకి వెళ్లాలనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు డైరెక్టర్స్ లో బాక్సాఫీస్ వద్ద ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందో చూడాలి. 

Tags:    

Similar News