తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ కొన్ని నెలల క్రితమే ‘తమిళగ వెట్రి కజగం’ అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. గత నెలలోనే పార్టీ జెండా, గుర్తులను సైతం ప్రకటించాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగానే విజయ్ ఇకపై సినిమాలకు దూరంగా ఉంటారని, పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేస్తారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే విషయంపై తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్. హీరో విజయ్ తన చివరి సినిమాను KVN బ్యానర్ లోనే చేస్తాడని అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడని, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని తెలిపింది. విజయ్ గత రెండు సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన అనిరుధ్ ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తాడని తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.