Thammudu Movie : ‘తమ్ముడు’.. ఇంత వీక్ గా ఉన్నారేంటీ..?

Update: 2025-06-30 08:45 GMT

సినిమా రిలీజ్ టైమ్ దగ్గరకు వస్తోందంటే ప్రమోషన్స్ హడావిడీ ఓ రేంజ్ లో కనిపిస్తుంటుంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. ఆ హడావిడీ వేరే ఉంటుంది. బడ్జెట్ పరంగా ఓ టాప్ హీరో మూవీకి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఉన్న తమ్ముడు చిత్రానికి మాత్రం అవేం కనిపించడం లేదు. పైగా స్టార్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్. కానీ ప్రమోషన్స్ మాత్రం తూతూ మంత్రంగానే కనిపిస్తుండటం ఆశ్చర్యం. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశాడు. జూలై 4నే విడుదల కాబోతోంది. అంటే నాలుగు రోజులు మాత్రమే ఉంది. అయినా ఆ హడావిడీ ఎక్కడా కనిపించడం లేదు.

నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ముగ్గురు ఫీమేల్ లీడ్స్ లో కనిపిస్తున్నారు. అలాగే లయ రీ ఎంట్రీ ఇస్తోంది. కనీసం ఈ నలుగురితో రకరకాల ఇంటర్వ్యూస్ ఇప్పించినా ప్రమోషన్స్ జరుగుతున్నాయి అనే ఫీలింగ్ వచ్చేది. బట్ వీళ్లు వాళ్లలో వాళ్లే ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నారు. అప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ వినిపించే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సినిమా గురించిన ఎలివేషన్స్ కూడా కనిపించవు.హీరోయిన్లందరితో దర్శకుడు చేసిన ఇంటర్వ్యూలో ఏ మాత్రం పస కనిపించలేదు. అలాగే నితిన్, దిల్ రాజు ఇంటర్వ్యూ సైతం సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేదిలా కనిపించలేదు.

అయితే నితిన్ గత సినిమా రాబిన్ హుడ్ విషయంలో చాలా అంటే చాలా ఎక్కువ ప్రమోషన్స్ చేశాడు. అన్ని ఇంటర్వ్యూస్ లో ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే సినిమా ఆల్ టైమ్ డిజాస్టర్స్ లిస్ట్ లో పడిపోయింది. అందుకే ఈ సారి అసలేం మాట్లాడను అని భీష్మించుకున్నాడట. ఆ కారణంగా అతను సైలెంట్ అయినా మిగతా వారితో అయినా ఆ జోష్ తెప్పించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం ఏం కనిపించడం లేదు. మరి ఈ సాధారణ ప్రమోషన్స్ తో 70 కోట్ల భారీ బడ్జెట్ మూవీకి ఓపెనింగ్స్ ఎలా వస్తాయో కానీ.. వీరి నమ్మకానికి మాత్రం చాలామంది ఆశ్చర్యపోతున్నారు. 

Tags:    

Similar News