OTT Release : ఓటీటీలోకి తంగలాన్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

Update: 2024-12-11 09:15 GMT

విక్రమ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తంగలాన్‌’. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఆపేయాలంటూ మద్రాసు కోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని మతాలను కించపరిచారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొంది థియేటర్‌లో విడుదలైంది కాబట్టి ఓటీటీ విషయంలో నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెలిపింది. ఓటీటీ విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశించింది. దీంతో దీని ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్‌ అయింది. తాజాగా నెట్‌ప్లిక్స్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Tags:    

Similar News