Tharun Bhascker : టైటిల్ దే ముందీ.. కంటెంట్ ఇంపార్టెంట్..

Update: 2026-02-09 12:04 GMT

టైటిల్ దే ముందీ.. కంటెంట్ ఇంపార్టెంట్.. ఇలాగే అనుకుంటున్నారు ఇప్పుడు జనం. సీరియస్ టైటిల్ తో పాటు కామెడీ మూవీ చేయడం.. కామెడీ టైటిల్ తో సీరియస్ మూవీ రూపొందించడం అనేది ఈ మధ్యే కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు 80, 90లలో కనిపించే పవర్ ఫుల్ టైటిల్ లా ఇప్పుడో మూవీ రాబోతోంది. గాయపడ్డ సింహం.. టైటిల్. ఈ టైటిల్ చూడగానే ఏ బాలయ్యదో లేక చిరంజీవిదో అనుకుంటాం కదా. కానీ తరుణ్ భాస్కర్ టైటిల్ ఇది. అదీ కాక ఇదో కామెడీ మూవీ అనిపించేలా ట్రైజర్ అంటూ విడుదల చేశారు. ట్రైజర్ అంటే టీజర్ కు ట్రైలర్ కు మధ్య ఉండే వీడియోట. అంటే టైటిల్ నుంచి ఇదో కొత్తదనం ఉన్న కంటెంట్ అనిపించేలా ఉంది.

తాజాగా ఈ గాయపడ్డ సింహం మూవీ ట్రైజర్ చూస్తే ఇదో కామెడీ మూవీ అనిపించేలా ఉంది. ఓ కుర్రాడు.. అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో వీసా విషయంలో డోనాల్డ్ ట్రంప్ పెట్టిన కండీషన్స్ వల్ల అతను అనేక విధాలుగా ఇబ్బంది పడటం.. ఆ క్రమంలో వచ్చే కథనం అన్నట్టుగా ఉంది. తరుణ్ భాస్కర్ తో పాటు ఫరియా అబ్దుల్లాతో పాటు మానస చౌదరి హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. చాలామంది నిర్మాతలు ఉన్నారు. క్రౌడ్ ఫండింగ్ మూవీయేమో అనిపించేలా. మొత్తంగా గాయపడ్డ సింహం అనే టైటిల్ కు తగ్గ పవర్ మాత్రం కంటెంట్ లో ఉండదు. అందుకు డిఫరెంట్ గా ఉండబోతోంది అనిపించేలా ఉంది.

Tags:    

Similar News