#90's వెబ్ సిరీస్ నిస్సందేహంగా తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ (OTT platforms) లో ఓ గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. శివాజీ, వాసుకి, మౌళి, రోహన్, వసంతిక నటించిన ఈ వెబ్ సిరీస్ , మధ్యతరగతి కుటుంబ దైనందిన జీవితాల్లోని కొన్ని ఎమోషన్స్ ను ప్రేక్షకుల హృదయాలకు టచ్ అయ్యేలా తెరకెక్కించారు. ఆదిత్య హాసన్ (Aditya Haasan) దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ఇప్పటి వరకు ఏ ఇతర తెలుగు సిరీస్‌లు సాధించని విజయాన్ని సాధించింది.
#90's ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ వెబ్ సిరీస్ గా గుర్తింపు పొందింది, ఈ మైలురాయిని సాధించిన మొదటి తెలుగు సిరీస్‌గా నిలిచింది. ఓర్మేక్స్ సర్వే ప్రకారం, #90's – A మిడిల్-క్లాస్ బయోపిక్ 2024 లో ఇండియా అంతటా అత్యధికంగా ఇష్టపడిన తెలుగు సిరీస్ గా గుర్తింపు పొందింది. ఇది చాలా పెద్ద షోస్ ను అధిగమించింది. నవీన్ మేడారం నిర్మించిన ఈ ధారావాహిక 1990ల నాటి కొందరు పిల్లల అద్భుతమైన మెమరీస్ కు సంబంధించిన జెర్నీ.
ఈటీవీ విన్ షోను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసినందుకు వీక్షకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు షోతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంతోషకరమైన సందర్భంగా, #90's బృందం ప్రస్తుతం సీజన్ 2 , సీజన్ 3 నిర్మాణంలో ఉన్నాయని, అవి వచ్చే ఏడాది విడుదల కానున్నాయని వెల్లడించింది.