Mohan Lal : 31 యేళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతోన్న క్లాసిక్ మూవీ

Update: 2024-08-13 10:12 GMT

కొన్ని సినిమాలు టైమ్ లెస్ గా ఉంటాయి. ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు. తరాలు మారినా.. ఆ థాట్ వారికి అప్పుడే ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యం తగ్గదు. అలాంటి మూవీస్ అన్ని భాషల్లోనూ అరుదుగా ఉంటాయి. విశేషం ఏంటంటే.. ఈ మూవీస్ కమర్షియల్ గా కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటాయి. మళయాలంలో వచ్చిన ‘మణిచిత్ర తాళు’ అనే మూవీ ఆ కోవలోకే వస్తుంది. ఇదేం సినిమా అనుకుంటున్నారా.. అదేనండీ.. రజినీకాంత్ చంద్రముఖి అంటూ వచ్చింది కదా దాని ఒరిజినల్ మూవీ ఇదే. 1993 డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీ అప్పట్లో మళయాల మూవీ రికార్డ్స్ అన్నిటినీ బద్ధలు కొట్టింది. మోహన్ లాల్, సురేష్ గోపీ, శోభన, నెడిముడి వేణు, వినయ ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చంద్రముఖిలో రజినీకాంత్ క్యారెక్టర్ ఎంత అల్లరిగా ఉంటుందో.. ఒరిజినల్ లో మోహన్ లాల్ క్యారెక్టర్ అంతకు మించి ఉంటుంది. రెగ్యులర్ హారర్ మూవీస్ కు భిన్నంగా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో సాగుతూ.. సడెన్ గా హారర్ టచ్ స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ లో భయం గొలిపే సన్నివేశాలతో వెన్నులో వణుకు పుట్టిస్తూ ముగిసే ఈ మూవీకి ఇప్పటికీ కోట్లమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఫాజిల్ డైరెక్ట్ చేసిన మణిచిత్రతాళును మాలీవుడ్ లో బెస్ట్ క్లాసిక్స్ లో ఒకటిగా చెప్పుకుంటారు. నటి శోభనకు బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ వచ్చిందీ మూవీకి. తర్వాత ఈ చిత్రం తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. తమిళ్ లో రూపొందిన చంద్రముఖినే తెలుగులో డబ్ చేశారు.

ఇప్పుడిదంతా ఎందుకో అర్థం అయ్యింది కదా.. యస్.. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది కదా. ఆ ట్రెండ్ లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. అసలు ఈ సినిమాను రీ రిలీజ్ చేయమని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ గా 4కే మిక్సింగ్ లో డాల్బీ అట్మాస్ఫియర్ లో ఈ సారి మరింత ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్ తో విడుదలవుతోందన్నమాట. త్వరలోనే రీ రిలీజ్ కాబోతోన్న మణిచిత్రతాళు ఈ సారి కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందనే అంచనాలున్నాయి.

అయితే రీ రిలీజ్ టైమ్ కు ఈ మూవీలో నటించిన చాలామంది ఆర్టిస్టులు చనిపోయి ఉండటం విషాదం.

Tags:    

Similar News