Robinhood Nithiin : రాబిన్ హుడ్.. ఇదా సర్ ప్రైజ్

Update: 2024-12-09 05:45 GMT

నితిన్, శ్రీ లీల జంటగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తోన్న మూవీ రాబిన్ హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోంది. వెంకీ, నితిన్ కాంబోలో ఇంతకు ముందు వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయింది. దీంతో ఈ కాంబోపై అంచనాలున్నాయి. కాకపోతే భీష్మ తర్వాత నితిన్ కు దాదాపు నాలుగైదు ఫ్లాపులు పడ్డాయి. ఆ ఫ్లాపుల నుంచి రాబిన్ హుడ్ గట్టెక్కిస్తాడు అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అటు శ్రీ లీల సైతం రాబిన్ హుడ్ పై చాలా ఆశలే పెట్టుకుంది. ఇక ఈ మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ రాబోతోందంటూ ఈ ఆదివారం ఓ హీరోయిన్ సజెషన్ లో ఉన్న ఫోటోను షేర్ చేసింది టీమ్. ఆ హీరోయిన్ ఎవరో గెస్ చేయండి అంటూ ఓ ఫజిల్ లాంటిది విసిరారు.

ఆ హీరోయిన్ ఎవరో జనం సరిగా గెస్ చేయలేకపోయారు అనే చెప్పాలి. తాజాగా తనెవరో రివీల్ చేశారు. హీరోయిన్ గా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏదీ హిట్ కాక ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు నానా తంటాలు పడుతోన్న కేతిక శర్మ తను. కొన్నాళ్లుగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న ఈ మూవీ రాబిన్ హుడ్ లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ పాటను మంగళవారం సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేస్తాం అని అనౌన్స్ చేశారు. మరి ఈ స్పెషల్ సాంగ్ కేతిక శర్మ మరో కొత్త ఆఫర్ తెస్తుందేమో చూడాలి. 

 

Tags:    

Similar News