Kishkindhapuri : కిష్కింధపురి టీమ్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉందిగా

Update: 2025-09-11 07:37 GMT

కిష్కింధపురి ఈ శుక్రవారం విడుదలవుతోంది. అయితే ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తోంది టీమ్. మామూలుగా ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్స్ కు వెళ్లదు ఏ టీమ్ అయినా. పెయిడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన మూవీస్ లో మాగ్జిమం విజయం సాధించాయి. ఏ కొందరో తప్ప ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కిష్కింధపురి టీమ్ కూడా అదే చేస్తోంది. ఒక రోజు ముందే ఆడియన్స్ కు చూపించడం అంటే తమ కంటెంట్ పై వారికి ఉన్న నమ్మకమే కారణం.

నిజానికి ఈ చిత్రాన్ని రెండు రోజుల ముందే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్రెండ్స్ తో పాటు మరికొందరు ఇండస్ట్రీ వారికి ప్రసాద్ ఐమాక్స్ లో చూపించారు. వారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లే ప్రీమియర్స్ కు వెళుతోంది టీమ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ సిటీస్ లో ప్రీమియర్స్ ను వేస్తున్నారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం. రిలీజ్ డేన కిష్కింధపురి .. మిరాయ్ వంటి ప్యాన్ ఇండియా మూవీతో పోటీ పడాల్సి ఉంది. అందుకే ప్రీమియర్స్ తో సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటే ఈ మూవీకి తిరుగుండదు అని చెప్పొచ్చు.

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో శ్రీకాంత్ అయ్యంగార్, భద్ర, ఆది, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశాడు. సాహు గారపాటి నిర్మాత. 

Tags:    

Similar News